ఏపీలో సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ. 32 కే ఉల్లిపాయలు!
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు భగ్గుమంటున్న తరుణంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కిలో రూ. 32 కే రాయితీ ఉల్లిని అందించనుంది. రైతు బజార్ల ద్వారా ప్రతి కుటుంబానికి వారానికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఆధార్, రేషన్ కార్డు అనుసంధానంతో పాటు 'రైస్' మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.