'ప్రజలను మోసం చేసేలా నాటకాలు డుతున్నారు': గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: తాడేపల్లి
తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని విస్మరించి వంచించారని, ఎన్నికల హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.