ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి: తుది ఓటర్ల జాబితా విడుదల!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 58 అర్బన్ లోకల్ బాడీలు మరియు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1,971 వార్డులకు సంబంధించిన తుది ఫొటో ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగానే త్వరలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానుండగా, పౌరులు తమ ఓటు హక్కును ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.