జగన్ కంచుకోటలో కూటమి ప్రభంజనం: పులివెందులలో ఏకగ్రీవాల మోత
రిపోర్టర్: సతీష్
స్థలం: Kadapa
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కంచుకోటగా భావించే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయం సాధించిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఇక్కడ జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకపక్షంగా భారీ విజయాలను నమోదు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో చేరాయి.