'యుపీఐ చార్జీలను మీ ఎంపీలు సమర్ధించలేదా?': కేంద్రం ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
యుపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్డీఆర్) విధింపును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో పాటు మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిశోరి లాల్, కే. గోపీనాథ్ తదితర కాంగ్రెస్ ఎంపీలు దీనిని ఆమోదించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ నివేదికలో ఎలాంటి వ్యతిరేకత తెలపకుండానే నిధుల సుస్థిరత కోసం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీ విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాలు ఎద్దేవా చేశాయి.