ఐచీ నగోయా ఏషియన్ గేమ్స్‌కు సిద్ధమైన 500 మందికి పైగా భారత అథ్లెట్లు

రిపోర్టర్: హరి స్థలం: India

జపాన్‌లోని ఐచీ నగోయా వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు 500 మందికి పైగా అథ్లెట్లతో కూడిన భారత బరిలోకి దిగుతోంది. గత హాంగ్‌జౌ క్రీడల్లో సాధించిన 106 పతకాల రికార్డును మెరుగుపరుచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ క్రీడల్లో పలువురు స్టార్ ఆటగాళ్లు తమ పతకాలను నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.