చాట్‌జీపీటీ తప్పుడు వైద్య సలహాతో యువకుడు మృతి

రిపోర్టర్: రాము స్థలం: World

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందిస్తున్న చాట్‌జీపీటీ ఇచ్చిన తప్పుడు ఆరోగ్య సూచనల వల్ల తన 19 ఏళ్ల కొడుకు సామ్ అకాల మరణం చెందాడని లీలా టర్నర్ కన్నీరుమున్నీరవుతున్నారు. క్రేటోమ్, జెనాక్స్ మందులను కలిపి వాడొచ్చని చాట్‌జీపీటీ తప్పుగా సూచించడంతో తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఆమె ఆరోపిస్తూ ఓపెన్ ఏఐ సంస్థపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.