క్రాప్ బుకింగ్ మరియు ఎరువుల సరఫరాపై కలెక్టర్ సమీక్ష

రిపోర్టర్: అశోక్ స్థలం: రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం నిర్వహించారు. క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎరువుల కొరత లేకుండా పంపిణీ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని, వ్యవసాయ రంగంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.