మాజీ డీజీపీ బాలసుబ్రహ్మణ్యం మృతి: చంద్రబాబు, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నిజాయతీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఆయన సేవలను కొనియాడుతూ ఇరువురు నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.