రేణిగుంట నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రిపోర్టర్: విజయ్
స్థలం: Renigunta, Tirupati District
తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ జూనియర్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పవన్ కళ్యాణ్ అనే పదహారేళ్ల విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పిచ్చాటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.