భారత బాక్సింగ్ సమాఖ్యలో కలకలం: మాజీ అధ్యక్షుడితో సంబంధాలు తెంచుకున్న వరల్డ్ బాక్సింగ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
భారత బాక్సింగ్ సమాఖ్యలో నెలకొన్న ఆధిపత్య పోరుపై అంతర్జాతీయ సంస్థ స్పష్టతనిచ్చిందని వరల్డ్ బాక్సింగ్ గవర్నెన్స్ డైరెక్టర్ జూలియన్ డ్యూక్స్ స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు బోరిస్ వాన్ డెర్ వోర్స్ట్ భారత్ పర్యటనకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు తమ తరఫున మాట్లాడే అధికారం లేదని వెల్లడించారు. ఈ మేరకు బీఎఫ్ఐ కార్యదర్శి ప్రమోద్ కుమార్ కు లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు.