పుణెలో పది రోజుల మద్య నిషేధంపై బాంబే హైకోర్టు ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహారాష్ట్ర
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పుణెలో 10 రోజుల పాటు మద్యంపై నిషేధం విధించడాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మద్యానికి బానిసైన వారు 10 రోజులు మద్యం తీసుకోకపోతే ఆసుపత్రులు కిక్కిరిసిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు మందలింపుతో యంత్రాంగం ఆ నిషేధాన్ని రెండు రోజులకు కుదించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మద్యం తాగి ఉన్నా లేకున్నా నిబంధనలు పాటించాలంటూ కోర్టు స్పష్టం చేసింది.