బైక్ ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త నార్టన్ 450 అర్బన్ ఆవిష్కరణ
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ నార్టన్ సరికొత్త నార్టన్ 450 అర్బన్ బైక్ ను ఆవిష్కరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నూతన మోడల్ ను రెండు ప్రత్యేక వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వారు పేర్కొన్నారు. శక్తివంతమైన ఇంజిన్ తో పాటు అత్యాధునిక ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. బైక్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేలా ఈ సరికొత్త డిజైన్ ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.