పాఠశాలల్ లో జెమినీ ఏఐ సేవలు నిలిపివేతపై స్పందించిన ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New York
పాఠశాలల్ లో విద్యార్థుల కోసం జెమినీ ఏఐ సేవలను నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై టెక్ దిగ్గజం గూగుల్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు విద్యారంగ విభాగానికి చెందిన ఉపాధ్యక్షులు క్రిస్ ఫిలిప్స్ వివరాలను వెల్లడించారు. విద్యార్థులు పాఠశాలల్ లో ఏఐ టూల్స్ వినియోగంపై విద్యా సంస్థలకే పూర్తి అధికారాలు ఉంటాయని, ఇకపై ఈ సేవలను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.