గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ విద్యార్థి
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
ఆటోలో సుమారు తొంబై గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అడ్డగూడూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థితో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. బొడ్డుగూడెం టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.