అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత సీనియర్ క్రీడాకారిణి పూనమ్ రౌత్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ అవకాశం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దేశం కోసం ఆడాలనే తన కల నెరవేరిందని, భవిష్యత్లో యువ క్రికెటర్లకు కోచింగ్ అందించడమే తన లక్ష్యమని పూనమ్ రౌత్ తెలిపారు.