తెలంగాణలో సరికొత్త సంక్షేమ విప్లవం: విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
దేశంలోనే కాదు ప్రపంచంలోనే మునుపెన్నడూ చూడని సంక్షేమ విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకలి లేని చదువులే లక్ష్యంగా భావితరాలకు బంగారు భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా కీలక ప్రకటన చేశారు.