సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.