రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్న వంగవీటి ఆశాకిరణ్, విజయవాడలో భూమిపూజ
రిపోర్టర్: మహేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కృష్ణలంకలో నూతన భవన నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. రాజకీయ కార్యకలాపాల కోసం ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో వంగవీటి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.