ప్రకాశం జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా బిట్రగుంట గ్రామంలో జొన్నలగడ్డ పోలీసులు అక్రమ మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తి నుంచి 30 ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.