కుట్రల తెరవెనుక నిజాలను బట్టబయలు చేస్తానన్న నాయకుడు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు నెల్లి రమేష్ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇళ్లు నిర్మిస్తానని చెప్పి రూ.75 లక్షలు వసూలు చేశానంటూ బూసి రాజన్న కుటుంబం చేస్తున్న ప్రచారం కేవలం అసత్యమని ఆయన మండిపడ్డారు. రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. తనను రాజకీయంగా అనగదొక్కేందుకు కొందరు స్వార్థపరులు పన్నుతున్న కుట్రలను త్వరలోనే ప్రజల ముందుంచి బట్టబయలు చేస్తానని ఆయన హెచ్చరించారు.