పార్వతీపురం మన్యం: కూటమి నేతల ఘర్షణతో అర్నాడలో తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: విజయ్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం అర్నాడలో కూటమి నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఎంపీటీసీ స్థానానికి ప్రచారం నిర్వహిస్తున్న కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని జనసేన శ్రేణులు నిలదీయడంతో ఒక్కసారిగా వాగ్వాదం తలెత్తింది. ఈ పరిణామంతో ఇరు పార్టీల వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.