ఎల్ఎండీ జలాశయంలో నీటి నిల్వలు లేక వెలవెల

రిపోర్టర్: కృష్ణ స్థలం: Thimmapur

తిమ్మాపూర్ మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొందని, మిడ్ మానేరు జలాశయం నిండి గేట్లు ఎత్తితే దిగువన ఉన్న ఎల్ఎండీ జలాశయం మాత్రం నీరులేక వెలవెలబోతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిండేందుకు ఇంకా పన్నెండు టీఎంసీల నీరు అవసరమని, పంటలను కాపాడుకోవడానికి మిడ్ మానేరు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.