పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించిన రాజేశ్వరి

రిపోర్టర్: GANESH BBL స్థలం: బలిజిపేట

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బైరిపురం గ్రామంలో ఆరోగ్యవంతమైన పర్యావరణం కోసం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. బొబ్బిలి సెంటర్ ఇంచార్జ్ రాజేశ్వరి అక్కయ్య గ్రామంలోని పెద్దలు, యువతీయువకులు, మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. గ్లోబ్ చుట్టూ ధ్యానం నిర్వహించి సానుకూల ఆలోచనలతో పర్యావరణాన్ని కాపాడుతామని సంకల్పం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన గ్రామస్తులకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.