గురుకుల విద్యార్థిని మృతిపై కలెక్టర్కు ఎస్టీ కమిషన్ నోటీసులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కునవరం

పోలవరం జిల్లా కునవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి వైద్య నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ జిల్లా కలెక్టర్ మరియు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుని పదిహేను రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో సివిల్ కోర్టు అధికారులను ఉపయోగించి సమన్లు జారీ చేస్తామని కమిషన్ హెచ్చరించినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలిపింది.