ఛత్తీస్గఢ్లో భారీ వర్షాల కారణంగా ఎనిమిది జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. దంతెవాడ, బిజాపూర్, కొండాగావ్, కాంకేర్, బస్తర్, గరియాబంద్, ధమ్తరి, దుర్గ్ జిల్లాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలు మూసిఉంటాయని అధికారులు వెల్లడించారు.