కాంగ్రెస్ అసమర్థతతోనే మేడిగడ్డ వద్ద వృథాగా నీరు: కేసీఆర్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
కాంగ్రెస్ పార్టీ చేతగానితనంతోనే ఈ వానాకాలంలో మేడిగడ్డ వద్ద అక్షరాలా ఏడు వందల యాభై టీఎంసీల నీరు సముద్రంపాలైందని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. కరువు కాలంలో ప్రజలను ఆదుకుంటుందనే ముందుచూపుతో తాము కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, ప్రస్తుత పాలకులు దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.