విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'రణబాలి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చారిత్రక చిత్రం అక్టోబర్ 16న విజయదశమి కానుకగా విడుదల కానుంది. కాగా, ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 19వ శతాబ్దపు బ్రిటీష్ పాలనా కాలం నాటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.