సైబర్ మోసాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీసుల తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: NTR District
ఆన్‌లైన్ ఉద్యోగాలు మరియు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో మోసపోవద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. టాస్క్ జాబ్స్, వీఐపీ టాస్క్, అప్ ఫ్రంట్ ఫీజులు, విత్‌డ్రాయల్ ఛార్జీల పేరుతో మోసగాళ్ళు నమ్మిస్తూ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.