మహిళల ప్రీమియర్ లీగ్ విస్తరణ: వచ్చే ఏడాది చర్చలు ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మహిళల ప్రీమియర్ లీగ్ లీగ్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ యోచిస్తోందని బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. జట్ల సంఖ్యను పెంచే అంశంపై వచ్చే ఏడాది అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, లీగ్‌లో భాగమైన కోచ్‌లు, సెలెక్టర్లు ఇతర భాగస్వాముల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.