ముంబైలో వృద్ధురాలి గొలుసు చోరీ చేసిన భోజ్‌పురి నటుడు అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Mumbai

ముంబైలోని శాంతాక్రుజ్ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన భోజ్‌పురి నటుడు ఆశిష్ అట్టార్‌చంద్ శర్మను వాకోలా పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ టేజ్‌ను పరిశీలించిన పోలీసులు, స్థానిక సమాచారంతో శ్యామ్ సుందర్ చాల్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.