నారా లోకేష్ నిబద్ధతకు పెద్దల పట్ల గౌరవమే నిదర్శనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెద్దల పట్ల గౌరవం, పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలో మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ముందుంటారని పలువురు కొనియాడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో ఆయన ఉన్న సాన్నిహిత్యం, పెద్దల పట్ల ఆయన ప్రదర్శించే వినయ విధేయతలు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.