స్థానిక ఎన్నికల్లో రెబల్స్ కలకలం: కూటమి పార్టీలకు తీవ్ర తలనొప్పిగా అసంతృప్తులు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెబల్స్ బెడద తీవ్ర కలకలం రేపుతోంది. కొన్ని ప్రాంతాలలో కూటమి నాయకులు బుజ్జగింపులతో అసంతృప్తులను దారిలోకి తెచ్చినా, మరికొన్ని చోట్ల మాత్రం నామినేషన్లు ఉపసంహరించుకోకుండా నేతలు పోటీలో కొనసాగుతున్నారు. ప్రధానంగా నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు సాలూరు పురపాలక సంఘంలోనూ రెబల్స్ అభ్యర్థుల నుంచి కూటమి పార్టీలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. పొత్తు ధర్మాన్ని పాటించాలని అగ్రనేతలు హెచ్చరిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సీట్ల కేటాపణల అసంతృప్తి చల్లారకపోవడం గమనార్హం.