ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన ఎసిపి
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ మండలం కేంద్రంలో రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని హుస్నాబాద్ ఎసిపి సదానందం స్పష్టం చేశారు. శనివారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వాకుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనం రోజున విగ్రహాల నిమజ్జనాన్ని రాత్రి 11 గంటలలోపు పూర్తి చేయాలని నిర్వాకులకు పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.