ఐటీఐలపై వస్తున్న అపోహలు నిరాధారమన్న సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ఐటీఐల నిర్వహణపై వస్తున్న అపోహలు పూర్తిగా నిరాధారమైనవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీఐలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తేల్చిచెప్పారు.