తీవ్ర వాయుగుండం ముప్పు నేపథ్యంలో ఏపీ యంత్రాంగం అప్రమత్తం

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

రాష్ట్రానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో సీఎం చంద్రబాబు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం-కవిటి మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.