చిన్న ముప్పారం మట్టేవాడ గ్రామాలలో కలెక్టర్ స్నేహ శబరిష్ విస్తృత పర్యటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం, గూడూరు మండలం మట్టేవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సవరణ, హియరింగ్స్, రీ సర్వే ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు కలెక్టర్ మహబూబాబాద్ వెల్లడించారు.