శ్రీశైలం భక్తుల సమస్యలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: మార్కాపురం
శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు దోర్నాల అటవీ చెక్‌పోస్టు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ అధికారులు, మార్కాపురం జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. అటవీ భూమిని కేటాయిస్తే సదుపాయాల కల్పనకు సిద్ధమని శ్రీశైలం దేవస్థానం ఈవో తరఫు న్యాయవాది తెలపగా, ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలని ధర్మాసనం స్పష్టం చేసింది.