కింతలి పాఠశాలకు పరదాల వితరణ: ఆర్మీ ఉద్యోగి సేవానిరతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
పొందూరు మండలం కింతలి జడ్పీ హైస్కూల్కు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దుంపల రమణ పదమూడు వేల విలువైన పరదాలను అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ సాయం చేశారు. ప్రధానోపాధ్యాయులు పైడి సూర్యారావుతో పాటు ఉపాధ్యాయులు శశిభూషణ్ రావు, బాబురావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను అభినందించారు.