ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్ల ఓటమికి కారణమని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Washington
మధ్యటర్మ్ ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల పెరుగుదలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ పరిణామంపై స్పందించిన ఆయన, సైనిక చర్యల వల్ల తాత్కాలిక ఆర్థిక భారం ఏర్పడినప్పటికీ దీర్ఘకాలంలో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో బలమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని, అయితే పెరిగిన ఇంధన ధరలు ఓటర్లపై ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు.