ఇంగ్లీష్ మాట్లాడితే అహంకారమా? నిర్మాత సుప్రియా మీనన్ ప్రశ్లు!
రిపోర్టర్: విజయ్
స్థలం: కేరళ
పబ్లిక్ వేదికలపై ఇంగ్లీష్ మాట్లాడటంపై జరుగుతున్న చర్చను నిర్మాత సుప్రియా మీనన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇంగ్లీష్ మాట్లాడితే అహంకారంగా ఎందుకు భావిస్తారని ప్రశ్నించారు. 'ఆశ' సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నటి ఊర్వశి, యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో సోషల్ మీడియాలో చెలరేగిన భాషా వివాదంపై ఆమె స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు.