భారతీయులకు అమెరికా నుంచి ఈబీ-1 గ్రీన్‌కార్డ్ హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమెరికా

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. అధిక డిమాండ్ కారణంగా ఈబీ-1 గ్రీన్‌కార్డ్ కేటగిరీ సెప్టెంబర్ 30లోపే అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. భారత కోటా త్వరగా పూర్తయ్యే పరిస్థితి ఏర్పడిందని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొనడంతో, అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.