'నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి': మాజీ ఎమ్మెల్యే, పోలీస్‌పై గ్యాంగ్‌రేప్ కేసు నమోదు

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని థానే జిల్లా భివండి తాలూకా బాప్‌గావ్ గ్రామంలో వివాహితపై కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల పరిష్కారం కోసం సంప్రదించిన కళ్యాణ్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్, సస్పెండ్ అయిన పోలీసు సిబ్బంది శైలేష్ పాటిల్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు 22 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్ఘా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ కాంచ కులకర్ణి సహాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.