ఫల గణనాథుడికి భక్తుల నీరాజనం

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

వినాయక చవితి వేడుకల్లో భాగంగా కావలి వాయినందన వీధిలో కివీ, బాదం, జీడిపప్పు తదితర డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గణనాథుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మండపాలు విద్యుత్ కాంతులతో కొత్త శోభను సంతరించుకోగా, ప్రత్యేక పూజలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది.