హైదరాబాద్‌లో పర్యాటకులను అలరించేందుకు త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

భాగ్యనగరంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతులను పంచేందుకు పర్యాటక శాఖ త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌తో పాటు చారిత్రక ప్రాంతాలను కలుపుతూ తొలి దశలో రెండు ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. పైభాగం ఓపెన్ టాప్‌గా, కింది భాగం ఏసీ విభాగంగా ఉండే ఈ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు తదితర అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.