ఓట్ల చోరీతో దేశంలో రాజ్యాంగం ఖూనీ అవుతోందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఓట్లు చోరీకి గురవుతున్నాయని, దీనివల్ల పార్లమెంట్ సభ్యులు రూపొందించే చట్టాలు సైతం చట్టవిరుద్ధంగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చీఫ్ ఎlection కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.