దానం అనర్హత వేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం స్పీకర్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాజ్యాంగం పట్టుకుని ఊరూరా నీతులు చెప్పే రాహుల్ గాంధీ.. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నీతిసూక్తులు నేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.