విశాఖ, అనకాపల్లి కోఆర్డినేటర్లుగా వంశీకృష్ణ యాదవ్ సహా పలువురు నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం
విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి కోఆర్డినేటర్‌గా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకంతో పాటు విశాఖకు పంచకర్ల సందీప్, పసుపులేటి ఉషకిరణ్, వన్నంరెడ్డి సతీశ్ కుమార్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. అలాగే అనకాపల్లికి పీవీఎస్ఎన్ రాజు, గెడ్డం బుజ్జి, సౌజన్యను నియమించారు. క్షేత్రస్థాయి వ్యూహాల కోసం ప్రత్యేక సపోర్ట్ టీమ్స్‌ను కూడా ప్రకటించారు.