ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కిటెక్స్ సంస్థకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం

రిపోర్టర్: సునీల్ స్థలం: Kochi

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక భేటీ నిర్వహించారు. కొచ్చిలో కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సబు ఎమ్. జాకబ్తో మంత్రి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను వివరించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని కిటెక్స్ సంస్థను ఆహ్వానించారు. అనంతరం కొచ్చిలోని ఆ సంస్థ ఫ్యాక్టరీని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.