నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nizamabad

తెలంగాణలోని నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తారి హరిబాబు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. గురువారం రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కారులో వచ్చిన దుండగులు హరిబాబును హత్య చేయగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కోరుట్లలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హత్యకు తానే బాధ్యుడినంటూ వైష్ణవి సోదరుడు సంతోష్ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల చేయడంపై పోలీసులు ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.